మగాళ్లు వట్టి మాయగాళ్లు అని అంటున్న రకుల్....ఎంత దారుణం
తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎక్కవ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారి లీస్ట్ లో చేరిపోయింది అందాల భామ రకూల్ ప్రీత్ సింగ్. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన రకూల్ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించింది. సంవత్సరంలో ఈ అమ్మడు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మరో విశేషం. ఇప్పుడు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా నటిస్తుంది.
తాజాగా రకూల్ నటించిన 'జయ జానకి నాయక' చిత్రానికి సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అబ్బాయిలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అ యాంకర్ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న ప్రశ్నకు.. మగ జాతిలోనే మంచి వాళ్ళు ఉండరన్నట్టు చెప్పడం షాకిచ్చింది? అసలు అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉంటారా ? అంటూ రివర్స్ కామెంట్ చేయడమే కాకుండా అసలు అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉండరు? ఇందులో సందేహమే లేదు.
ఒకవేళ మంచి వారు ఉన్నారూ అంటే..వారు ఖచ్చితంగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి నాటకాలు ఆడేవారై ఉంటారని..అంతే కాకుండా అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉండరు కాబట్టే .. నాకు మంచి వాడు భర్త గా రావాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పింది? మరి ఈ అమ్మడికి మగాళ్లపై అంతగా ద్వేషం కలగడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ.
తనకు రాబోయే భర్త మాత్రం తనకన్నా కాస్త పొడువుగా ఉండాలని అంటుంది. మరి ఈ అందాల భామ చేసిన కామెంట్స్ అబ్బాయిలు ఎంతగా బాధపడి ఉంటారో..వారి స్పందన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
Hi I am Pavani Admin of this site.if you want more fun videos,technology videos,science videos and movie videos please follow my site and subsribe through Facebook,twitter,Google+.Please suggest your interesting topics in comment box,i will update as per your request.
I am Founder of www.Mulakaya.com
0 comments:
Post a Comment