How Central And State Governments Cheating People Regarding Petrol Prices

పెట్రోల్పై కేంద్రం ఎడాపెడా బాదుడు

మార్కెట్లో లీటరు పెట్రోల్‌ ధర ఎంతఅటూఇటుగా రూ.74.5.అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇది రోజూ మారుతుంటుందిపెట్రోల్డీజిల్‌ ధరల్ని నిజంగా అంతర్జాతీయ చమురు ధరలే ప్రభావితం చేస్తున్నాయాఅక్కడికి అనుగుణంగా ఇక్కడా పెరుగుతూతగ్గుతున్నాయాసమాధానం కావాలంటే  రెండంకెలు చూడాలి.


2014 మే నెలలో.. 
♦ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అత్యంత గరిష్టంగా బ్యారెల్‌ 109 డాలర్లకు చేరిందిఅప్పుడు దేశంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.81.

2017 సెప్టెంబర్లో...
♦  అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ధర బ్యారెల్‌ 48 డాలర్ల వద్ద ట్రేడవుతోందిదేశీయంగా ఇప్పుడు లీటరు పెట్రోల్‌ ధర రూ.74.5

పెట్రోల్డీజిల్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రకారమే మారుతున్నాయనడం అబద్ధమనేందుకు పై రెండు ఉదాహరణలు చాలవూ...!! అసలు పెట్రోల్డీజిల్‌ ధరల వెనక ఎవరి లాభమెంతప్రభుత్వ పన్నులెంతదీనికి ఎవరి లాజిక్కేంటిమొత్తంగా వినియోగదారుడు నష్టపోతున్నాడాలేదా?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు పెరగటమే కాదు!! తగ్గటమూ తెలుసుకానీ దేశీ ధరలకు మాత్రం పెరగటం మాత్రమే తెలుసు!! ఎందుకంటే పెట్రోల్డీజిల్‌ ధరల్ని మార్కెట్కు అనుసంధానించడం ద్వారా ధర తగ్గితే... ప్రయోజానాన్ని ప్రజలకు మళ్లిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. అలా మిగిలే డబ్బుల్ని తన పన్నుల ఖాతాలో వేసేసుకుంటోందిఖజానాకు మళ్లిస్తోందిపెరిగినప్పుడు మాత్రం  భారం జనంపై వడ్డిస్తోందిఫలితమే తాజా పెట్రోల్డీజిల్‌ ధరలుఇక జూన్‌ నెల్లో రోజువారీ ధరల్ని సవరించే విధానాన్ని ప్రవేశపెట్టాక ఇప్పటిదాకా పెట్రోల్‌ ధర ఏకంగా లీటరుకు తెలుగు రాష్ట్రాల్లో 8 రూపాయల వరకూ పెరిగిపోయింది.

 విధానం అమల్లోకి వచ్చాక ధర తగ్గిన రోజులు వేళ్లమీద లెక్కపెట్టవచ్చుప్రపంచ మార్కెట్లో మాత్రం ముడి చమురు ధర గత ఆరు వారాల నుంచి 46–50 డాలర్ల మధ్య మాత్రమే హెచ్చుతగ్గులకు లోనవుతోందికేవలం 2–3 రోజులు మాత్రమే 50 డాలర్ల స్థాయిని దాటి మళ్లీ పడిపోయిన క్రూడ్‌ ప్రస్తుతం 48 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోందికానీ మంగళవారంనాటి ధరల సవరణతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్‌ రూ.74.51 వద్దకువిజయవాడలో రూ.76.35 వద్దకు చేరిందిమూడేళ్ల తర్వాత పెట్రోల్‌ ధర  స్థాయికి చేరటం ఇదే ప్రథమం.

పన్నుల బాదుడే అసలు కారణం...

2014
లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు పెట్రోల్పై లీటరుకు ఎక్సయిజు సుంకం రూ.9.40.  తరవాతి సంవత్సరాల్లో పదేపదే  సుంకాన్ని పెంచేశారుఇపుడది ఏకంగా రూ.21.48కి చేరిందిడీజిల్పై సుంకం సైతం రూ.3.46 నుంచి రూ. 17.33కి చేరుకుంది. 2014 మేలో ప్రపంచ మార్కెట్లో 110 డాలర్లకు చేరిన ముడిచమురు బ్యారెల్‌ ధర...  తరవాత నుంచి పతనమైందిదీంతో పెట్రోల్డీజిల్‌ ధరల్ని తగ్గించి దాన్ని తన ఘనతగా చెప్పుకుంది అప్పటి కొత్త సర్కారు. 2015 మొదట్లోనూ క్రూడ్‌ పతనం కొనసాగడంతో  ఏడాది మధ్య నుంచి  ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా తన జేబులో వేసుకుందిదీనికి తగ్గట్టుగా ఎక్సయిజు సుంకం పెంపును మొదలెట్టిందిఅప్పటి నుంచి... ప్రపంచ ధరలతో సంబంధం లేకుండా ఇక్కడి ధరలు పెరుగుతూనే వస్తున్నాయిఅంతర్జాతీయంగా ధరలు పెరిగితే.. తాము పెంచిన సుంకాల్ని వెనక్కితీసుకుంటామంటూ  పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంటు సాక్షిగా హామీ కూడా ఇచ్చారు హామీ నెరవేరిన రోజులు ఇప్పటివరకూ లేవు.

అక్కడ సగానికిపైగా తగ్గినా...: 2014 మే నెలలో ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర బ్యారెల్కు 109 డాలర్లు పలకగా... భారతీయ రిఫైనరీలు దిగుమతి చేసుకునే ‘ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌’ ధర రూ. 6,600 వరకూ వుండేదిఅప్పట్లో లీటరు పెట్రోల్‌ రూ.81కి లభ్యమయ్యేదిఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో లైట్‌ స్వీట్‌ క్రూడ్‌ ధర 48 డాలర్లుమనం దిగుమతి చేసుకునే ఇండియన్‌ బాస్కెట్‌ క్రూడ్‌ రూ.3,200. అంటే 2014 మేతో పోలిస్తే సగానికిపైగా తగ్గిందికానీ మార్కెట్లో లీటర్‌ పెట్రోల్‌ ధర 10 శాతమే తగ్గిందిఎందుకంటే మిగిలిన మొత్తాన్ని పన్నులు పెంచేసి ప్రభుత్వం లాగేసుకుంది మరి!!.

కేంద్రమే కాదు...రాష్ట్రాలు కూడా...

అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోడీజిల్‌ ధరలను వినియోగదారులకు అందించకుండా పన్నుల పేరిట జేబులో వేసుకుంటున్నది కేంద్రం మాత్రమే కాదురాష్ట్రాలూ తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నాయిదేశంలో ఇంధనాలపై అత్యధిక వ్యాట్‌ విధిస్తున్న జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చుదేశంలో వీటి ధరలు తగ్గుతున్న సమయంలో  రెండు రాష్ట్రాలూ వ్యాట్ను పెంచేశాయిదీంతో పెట్రోల్పై వ్యాట్‌ 26% నుంచి 31%కి పెరిగిందితెలంగాణలోకంటే ఆం«ధ్రప్రదేశ్‌ రెండాకులు ఎక్కువే చదివిందిఅందుకే అక్కడ వ్యాట్‌ రెండు రూపాయిలు ఎక్కువప్రస్తుతం పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సయిజు సుంకాలు తగ్గించకపోగారాష్ట్రాలు వ్యాట్ను తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బహిరంగ వేదికల్లో కోరుతుండటం గమనార్హంఇక రాష్ట్రాలు సైతం కేంద్రం పన్నులు తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గుతాయని అప్పుడప్పుడు చెబుతుంటాయిఅంటేఇద్దరూ ఇద్దరేనన్న మాట!.

కంపెనీలూ తక్కువ తినలేదు..

రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చాక 10 శాతం వరకూ పెట్రో ధర పెరగడానికి ప్రభుత్వ పన్ను పోటుతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయిప్రభుత్వాలు వాస్తవానికి  మధ్య పన్నులుసుంకాల్ని పెంచనప్పటికీఅవి శాతం రూపంలో ఉన్నందున ధర పెరిగితే  పన్నులుసుంకాలు ఆటోమేటిగ్గా పెరిగిపోతుంటాయిఇక ప్రభుత్వాలకు తోడు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలురిఫైనరీలు కలిపి లీటరుకు ఒక రూపాయి లాభాన్ని ఎక్కువగా తీసుకుని... కలిసి పంచుకుంటున్నాయిమెరుగైన ధరల విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా రూపాయి లాభాన్ని అదనంగా ప్రభుత్వ అనుమతితోనే అవి తీసుకుంటున్నాయిమరోవైపు పెట్రో డీలర్ల కమిషన్‌ లీటరుకు 50 పైసల చొప్పున పెరిగింది.

ముడి చమురు ధర మూడేళ్లుగా
దిగివచ్చినాబంకుల్లో మాత్రం మనకు
ధరలు తగ్గకపోవటానికి...
తిలా లాభంతలా పిడికెడు అన్న మాట.


మార్కెట్లో పెట్రోల్‌ ధర లీటరు రూ.74. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో దీనికోసం పెడుతున్న ధరఇక్కడ రిఫైనింగ్రవాణా ఖర్చులు... డీలర్ల కమీషన్కంపెనీల లాభం... అంతా కలిపితే అయ్యేది రూ.29 మాత్రమేమిగిలిన 45 రూపాయలేంటో తెలుసాకేంద్ర రాష్ట్రాలు విధిస్తున్న పన్నులుఅందుకే అంతర్జాతీయంగా ఎంత తగ్గినా... మన బంకుల్లో మాత్రం ధర అదిరిపోతోంది.

SHARE

Hi I am Pavani Admin of this site.if you want more fun videos,technology videos,science videos and movie videos please follow my site and subsribe through Facebook,twitter,Google+.Please suggest your interesting topics in comment box,i will update as per your request.
I am Founder of www.Mulakaya.com

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment