No Limits For Indians For Getting H1 VISAs

హెచ్‌1 బీ వీసాలపై పరిమితులు లేవు

హెచ్‌1బీ వీసాల జారీ విషయంలో ఆందోళనపై  భారతీయులకు భారీ ఊరట కలగనుంది. హెచ్‌1 బీ వీసాలపై ఎలాంటి పరిమితులు ఆంక్షలు లేవని  అమెరికా సీనియర్  అధికారి  గురువారం వెల్లడించారు.

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్  సర్కార్ హెచ్ 1బీ వీసాలపై సమీక్షిస్తున్నంత మాత్రాన భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతానికి హెచ్1బీ వీసాల జారీపై ఎలాంటి పరమితులు లేవని అమెరికా సీనియర్ అధికారి స్పష్టం చేయడం  విశేషం.

హెచ్‌ 1బీ  కేటగిరీలో జారీ అయ్యే వీసాలు ఎక్కువ శాతం భారతీయులకే దక్కాయని  ఆయన చెప్పారు.   గత తొమ్మిది నెలల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభించినట్టు చెప్పారు. తద్వారా గత సంవత్సరం రికార్డుల సంఖ్య 1.2 మిలియన్లను అధిగమించిందన్నారు.   ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో పోలిస్తే భారత్కు సంవత్సర, సంవత్సరానికి  హెచ్‌1బీ, ఎల్‌ 1(వర్క్పర్మిట్‌) వీసాల జారీ 6శాతం పెరుగుతోందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్త వలసదారుల వీసా దరఖాస్తుదారులతో పోలిస్తే  చైనా, ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికోల తరువాత ఆరు శాతం వృద్ధితో ఐదో అతిపెద్ద లబ్దిదారులుగా  భారతీయులున్నారని వివరించారు.

గత ఏడాది 88వేల స్టూడెంట్వీసాలను జారీ చేశామని 2015 సంవత్సరంపోలిస్తే ఇది 15శాతం అధికమని చెప్పారు. ప్రస్తుతం సుమారు 1.6లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారన్నారుచైనా తర్వాత  అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో  రెండవ స్థానంలో భారత్ఉందని తెలిపారు.

సెప్టెంబరు 27 వాషింగ్టన్లో  జరగనున్న ఇండో-అమెరికా ద్వైపాక్షిక  సమావేశంలో కేవలం వాణిజ్య, పర్యాటకరంగం అభివృద్ధి గురించే చర్చించడం జరుగుతుందనీ, కానీ ఎజెండాలో లేనప్పటికి  హెచ్‌ 1బీ  వీసాల ఆంక్షలు, పరిమితులు,కోత అంశం చర్చకు రావచ్చని ఆయన తెలిపారుఅలాగే 7,000 మంది భారతీయులను ప్రభావితం చేయనున్న  డిఫెర్డ్యాక్షన్ ఫర్ డిపార్టెడ్ యాక్షన్ (డిఎసిఎ)పై కూడా  చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.
SHARE

Hi I am Pavani Admin of this site.if you want more fun videos,technology videos,science videos and movie videos please follow my site and subsribe through Facebook,twitter,Google+.Please suggest your interesting topics in comment box,i will update as per your request.
I am Founder of www.Mulakaya.com

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment